“(1). ఆస్తికతను గుడ్డిగా నమ్మి ఎట్టి అన్వేషణా, యోచనా చేయక మతాచారాలను పాటిస్తూ, జీవించేవారు కొందరు (2) అస్తికతే సర్వ అనర్థాలకూ మూలమని గుడ్డిగానమ్మి దానిని రూపుమాప యత్నించేవారు కొందరు (3) జీవితానికి ఏ గమ్యమూ లేకుండా పాశవికంగా బావిలో కప్పవలె జీవించేవారు కొందరు (4) వంచకులు: వీరు మొదటి రెండు దృక్పథాలలో ఒక దానిని అంగీకరించినట్లు కనబడి, వారిని ఇతరులు వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పోయినపుడు 'అవన్నీ అనావశ్యకం. మానవుడుగా మన కర్తవ్యం చేసుకుపోతే చాలు' అన్న ప్రచ్ఛన్నమైన మూడవ దృక్పథాన్ని వల్లించి, పరోక్షంగా రెండవ దృక్పథాన్ని అనుసరించే వారు (5) అన్వేషకులు. ఈ ఐదు రకాల వారిలో అన్వేషకుడు మాత్రమే నిజమైన మనోవికాసాన్ని చెందుతున్న మానవుడు”

- పరమపూజ్య ఆచార్య శ్రీ భరద్వాజ
['విజ్ఞాన వీచికలు' గ్రంధము నుండి]