Saimaster Forums  |  Acharya Ekkirala Bharadwaja  |  Shirdi Sai Baba  |  Books  |  Saibaba Magazine  |  Photos  |  Audio and Video  |  Contacts  |  Home

To Blossom Every Moment into a Better Manifestation of Perfection Is the Only Business of Life - Pujya Acharya Sri Ekkirala Bharadwaja

 
Saimasterforums - Daily Inspirational Quotes of Master Garu!!!        October 22, 2014 07 PM IST
జై సాయిమాస్టర్!

........తండ్రికి బిడ్డ ప్రయోజకుడై తన శక్తిపై స్వతంత్రుడుగా నిలబడి అవసరమైతే పదిమందికి చేయూత నివ్వగలగాలని వుంటుంది గాని ఎల్లకాలం కావలసినదానికల్లా తన దగ్గర చేయిజాపేవాడుగా వుండాలనిపించదు. అదే అతని తపన. ప్రాకృతికమైన దేహాన్ని ప్రసాదించే పామరుడు, స్వార్ధపరుడూ అయిన తండ్రికే యింత తపన వుంటే తల్లీ, తండ్రి, గురువు, దైవమూ తానే అయిన ప్రేమమూర్తికి, సద్గురువుకు ఎంత అరాటముంటుంది. సాయి ఆశించేది మనం సాధ్యమైనంత త్వరగా ఏమీ కోరనక్కరలేని స్థితిని చేరాలనే. అదే దుఃఖ నివృత్తి. ముక్తి పొందాలని భక్తునికున్న కోరికకంటే ఎన్నోరెట్లు ఆరాటం గురువుకట్టి స్థితిని ప్రసాదించాలని ఉంటుంది. అట్టి నిర్హేతుకమైన ప్రేమ స్వరూపి గనుకనే అతడు దైవం, నిజమైన తల్లి, తండ్రి, ఆప్టుడు. అతడట్టి ప్రేమమయుడనీ, దానికితోడు సర్వజ్ఞుడనీ మనం విశ్వసించడమే అతణ్ణి మనం గురువుగా తలచడమంటే. అట్టివాణ్ణి మనమేం కోరాలి? మనం దానిని కోరుతున్నమాటే నిజమైతే, దానిని సులభంగా పొదే లాగ యోచించడమెలాగో ఆయన బోధిస్తే దానినెందుకు ఆచరించము? అంటే దుఃఖనివృత్తికై మనకు సత్యమైన కోరికలేదన్నమాట! నిజంగా కోరనిదే ఆయన ఎందుకు ప్రసాదించాలి? అలా వివేకంతో యోచించడానికి సంసిద్ధుడుగాని వ్యక్తికి నిజంగా దుఃఖనాశమవసరంలేదన్నమాట. అటువంటప్పుడు దానికై ప్రార్ధించడం బూటకం కాదా? బూటకాన్ని గుర్తించలేనివాడు దైవమెలా అవుతాడు? దుఃఖమంటే మనకంత ప్రీతివుంటే మనం దుఃఖించడమెందుకు? హాయిగా వుండవచ్చుగదా? అప్పుడు దుఃఖమెక్కడిది? అపుడు మనం ప్రార్ధిస్తున్నది దేనికోసం?.....

ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజగారి 'శ్రీ సాయినాధ ప్రబోధామృతము', pg.57

http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Sainathaprabodhamruthamu&page=56
http://www.saibharadwaja....