Parama Pujya Master's Speeches and Videos

Bhogi Pandlu
భోగి పండ్లు

భోగి పండ్లు పోద్దాము రారే
  ప|| : భోగి పండ్లు పోద్దాము రారే పడతులారా!    
  అ|| ప|| : యోగియైనా, త్యాగియైన భరద్వాజ గురునికిపుడు ||భోగి పండ్లు||  
  చరణాలు:        
  1.   తలపులనే పండ్లు తెచ్చి శిరసువంచి గురుని మ్రొక్కి |
మనసును హరియించమని మనోహరుడౌ గురునివేడి ||
||భోగి పండ్లు||  
  2.   శిరమున పండ్లను పోయగ శిరమునెత్తి చిరునవ్వుల |
అరుణారుణ కాంతులు మైమరపించెడి గురునికిపుడు ||
||భోగి పండ్లు||  
  3.   కనులరెప్పలార్పినంత కనుమరుగైపోవునేమొ |
కనులపండుగైన గురుని కనులారగ జుచుకొనుచు||
||భోగి పండ్లు||  
  4.   నరునిదృష్టి సోకినంత నల్లరాయి పగులునంట |
పరమపురుషుడౌ గురునికి మనదృష్టియె సోకకుండా ||
||భోగి పండ్లు||  
  5.   దృష్టిని బాపగ గురునికి దిష్టితీసి బొట్టుపెట్టి |
కష్టసుఖములందు కృపాదృష్టిని ప్రసరింపుమనుచు ||
||భోగి పండ్లు||  
  6.   అవధూతల ఘనయోగుల ప్రియతనయుడు తానేయట |
సమర్థ సద్గురు షిరిడి సాయి సుతుడు తానేయట ||
||భోగి పండ్లు||  
Bhogi Pandlu Poddamu Raare!
  Pallavi : Bhogi Pandlu Poddamu Raare! Padatulaara!    
  Anu Pallavi : Yogiyaina Tyagiyaina Bharadwaja Gurunikipudu || ||Bhogi Pallu||  
  Charanams:        
  1.   Talapulane Pandlu Techchi Sirasuvanchi Guruni Mrokki |
Manasunu Hariyimpumani Manoharudau Guruni Vedi ||
||Bhogi Pallu||  
  2.   Siramuna Pandlanu Poyaga Siramuneththi Chirunavvula |
Arunaruna Kaanthula Maimaraapinchedi Gurunikipudu ||
||Bhogi Pallu||  
  3.   Kanulareppalaarpinantha Kanumarugaipovunemo |
Kanulapandugaina Guruni Kanulaaraga Joochukonuchu ||
||Bhogi Pallu||  
  4.   Naruni Drushti Sokinanta Nallaraayi Pagulunanta |
Paramapurushudau Guruniki Mana Drushtiye Sokakunda ||
||Bhogi Pallu||  
  5.   Drushtini Baapaga Guruniki Dishti Theesi Bottu Petti |
Kashtasukhamulandu Krupadrushtini Prasarimpumanuchu ||
||Bhogi Pallu||  
  6.   Avadhootala Ghanayogula Priyatanayudu Taaneyata |
Samartha Sadguru Shiridi Sai Suthudu Taaneyata ||
||Bhogi Pallu||  


Bala Bharadwajunaku Bhogi Pandlanu Poyu Veduka
బాల భరద్వజునకు భోగి పండ్లను పోయు వేడుక

ప|| : బాల భరద్వజునకు భోగి పండ్లను పోయు వేడుక
చూద్దాము రారే ||
   
అ|| ప|| : వేడుక చూడంగ వేయి కనులు చాలవట |
వేడుక వర్ణింప వేయి నాల్కలు చాలవట ||
   
చరణాలు:        
1.   పసిబాలునకు పట్టు పుట్టంబులను గట్టి |
నుదుట కస్తూరి తిలకం తీరుగా దిద్ది |
దృష్టి దోషము బాప దిష్టి చుక్కను పెట్టి |
ముదితలందరు ముద్దులాడుచు ముచ్చట తీరగ ఇపుడు ||
||బాల||  
2.   గజ్జెలందియలు ఘల్లుఘల్లున మ్రోగంగ |
రత్నకంకణములు హస్తముల కదలంగ |
మౌక్తిక హారములు మెడలోన మెరవంగ |
శిరము ఊగగ ఒడలు కదలగ తడబడు నడకల ||
||బాల||  
3.   పచ్చని తోరణములు పరిమళ సుమములు సరములు |
అచ్చటచ్చట అమరిన పుష్ప గుఛ్చంబులు |
అచ్చెరువునొందించు చిత్రమౌ జ్యోతుల కాంతులు |
ముచ్చటగ తీర్చిదిద్దిన ముగ్గులు వేదికపై ||
||బాల||  
4.   బంగరు పళ్ళెరముల బదరి ఫలములనుంచి |
రంగైన రత్నములు, పగడములు, ముత్యములు |
రంగుల పూరేకులు, బంగరు నాణెముల చేర్చి |
పొంగుమీరగ ఆంగనలు అంగరంగ వైభవముగ ||
||బాల||  
5.   కలువరేకుల కనులు, చిలిపి చూపుల నవ్వులు |
అలరింపజేసెడి జిలిబిలి పలుకులు |
బొద్దుగ ముద్దుగారెడి మోహన రూపము |
గద్దించెడి కవ్వించెడి, గద్దరి చేతల ||
||బాల||  
6.   వేడుకలు వీక్షింప విచ్చేసిన దేవతలు |
వేవేల విధముల వేనోళ్ళ నుతియింప |
మాయ బాపుమనుచు తోయజాక్షులు ప్రార్ధింప |
మాయధారియై మసలెడి పరమాత్ముడైన యీ ||
||బాల||  
Pallavi : Bala Bharadwajanaku Bhogi Pandlanu Poyu Veduka
Chuddamu Rare ||
   
Anu Pallavi : Veduka Choodanga Veyi Kanulu Chalavata |
Veduka Varnimpa Veyi Nalkalu Chalavata ||
   
Charanams:        
1.   Pasi Balunaku Pattu Puttambulanu Gatti |
Nuduta Kasturi Tilakamu Teeruga Diddi |
Drusti Doshamu Bapa Dishti Chukkanu Petti |
Muditalandaru Mudduladuchu Muchchata Teeraga Ipudu ||
||Bala||  
2.   Gajjelandiyalu Ghallu Ghalluna Mroganga |
Ratnakankanamulu Hastamula Kadalanga |
Mouktika Haramulu Medalona Mervanga |
Siramu Vugaga Vodalu Kadalaga Tadabadu Nadakala ||
||Bala||  
3.   Pachchani Toranamulu Parimala Sumamula Saramulu |
Achchatachchata Amarina Pushpa Guchchambulu |
Achcheruvunondinchu Chitramou Jyotula Kantulu |
Muchataga Teerichididdina Muggula Vedikapai ||
||Bala||  
4.   Bangaru Palleramula Badari Phalamulanunchi |
Rangaina Ratnamulu, Pagadamulu, Mutyamulu |
Rangula Poorekulu, Bangaru Nanemula Cherchi |
Pongumeeraga Anganalu Angaranga Vaibhavamuga ||
||Bala||  
5.   Kaluvarekula Kanulu, Chilipi Choopula Navvulu |
Alarimpajesedi Jilibili Palukulu |
Bodduga Muddugaredi Mohana Roopamu |
Gaddinchedi Kavvinchedi, Gaddari Chetala ||
||Bala||  
6.   Vedukalu Veekshimpa Vichchesina Devatalu |
Vevela Vidhamula Venolla Nutiyimpa |
Maaya Bapumanuchu Toyajaakshulu Prardhimpa |
Maayadhariyai Masaledi Paramaatmudaina Ee ||
||Bala||  

   Laali Sri Guru.. లాలి శ్రీగురు భరద్వాజ.. 
   Nidurinchu Mayamma .. నిదురించు మాయమ్మా.. 

   Naamam Chanting - నామ సంకీర్తనము 


Jai Sai Master